చేతబడి చేస్తుందని మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్థులు

TG: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోములలో దారుణం చోటుచేసుకుంది. చేతబడి చేస్తుందనే అనుమానంతో పల్లేటీ వెంకటమ్మ (60)ను గ్రామస్థులు ఇంటి నుంచి బయటకు ఈడ్చుకొచ్చి చెట్టుకు కట్టేసి కొట్టారు. తీవ్రంగా గాయపడిన వెంకటమ్మ మంచాల పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఘటనకు సంబంధించి 14 మందిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత కొంతకాలంగా వెంకటమ్మ రాత్రులు వింత పూజలు చేస్తుందని, చిన్న పిల్లలపై కూడా చేతబడి ప్రయోగాలు చేస్తుందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕