100 కోట్లకు చేరిన విలన్ చరణ్ రాజ్ ఆస్తులు!

తన జీవిత ప్రయాణం, ఆర్థిక వ్యూహాలు, కెరీర్‌లోని మరపురాని క్షణాలను ప్రముఖ నటుడు చరణ్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముఖ్యంగా తన ఆర్థిక క్రమశిక్షణ, భూమిపై చేసిన తెలివైన పెట్టుబడుల గురించి వివరించారు. అప్పట్లో బెంగుళూరు, బెల్గాం వంటి నగరాల శివార్లలో ఎకరం భూమిని కేవలం రూ. 100 నుండి రూ. 500కు కొనుగోలు చేశానని, ఈ భూములు ఇప్పుడు రూ. 100 కోట్లకు పైగా విలువకు చేరుకున్నాయని తెలిపారు. తన సినీ కెరీర్‌లో అత్యుత్తమ ఘట్టంగా, దర్శకుడు టి. కృష్ణ రూపొందించిన ప్రతిఘటన చిత్రానికి నంది అవార్డు పొందడాన్ని, అప్పటి సీఎం ఎన్టీ రామారావు తన నటనను ప్రశంసించడాన్ని గుర్తు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్