వినాయక చవితి రోజున ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకుని, వాకిలిలో ముగ్గులు పెట్టాలి. గుమ్మానికి మామిడి ఆకుల తోరణాలు కట్టుకోవాలి. పూలమాలతో అలంకరించుకోవాలి. ఇక ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్లెంలో బియ్యం పోసి వాటిపై తామరాకును పెట్టి వినాయకుడి ప్రతిమను ప్రతిష్టించాలి. అనంతరం గణేశ షోడశ నామాలతో పూజించాలి. తర్వాత పూవులు, అక్షింతలు వేస్తూ అష్టోత్తర శతనామాలతో విఘ్నేశ్వరుడికి అర్చించాలి.