దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు మొదలయ్యాయి. మండపాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అయితే మండపాలు ఏర్పాట్లు చేసేటప్పుడు విద్యుత్శాఖ అధికారులు కొన్ని జాగ్రత్తలు సూచించారు. మండపాలలో విద్యుత్ సరఫరా కోసం సిల్క్ తీగలను వాడరాదు. కరెంట్ స్తంభాల నుంచి సరఫరా చేసే ప్రధాన తీగకు అతుకులు లేకుండా చూసుకోవాలి. వర్షాలు పడే సమయంలో విద్యుత్తు తీగను, ఇతర ఏ విద్యుత్తు ఉపకరణాలను తడి చేతులతో ముట్టరాదు. కరెంట్ కోసం వాడే జంక్షన్ బాక్సులను నేల మీద ఉంచరాదు.