సెలక్షన్‌ ట్రయల్స్‌లో.. వినేశ్‌ శుభారంభం (వీడియో)

ఆసియా క్రీడల కోసం జరుగుతున్న సెలక్షన్ ట్రయల్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫోగట్ విజయం సాధించింది. ఓపెనింగ్ బౌట్‌లో ఆమె 7-1 స్కోరుతో రెజ్లర్ జ్యోతిపై గెలుపొందింది. మ్యాచ్ ప్రారంభంలో జాగ్రత్తగా ఆడిన వినేశ్, ఆ తర్వాత మెరుగైన ఆటతీరుతో ప్రత్యర్థికి పాయింట్లు ఇవ్వకుండా ఆధిపత్యం చెలాయించింది. రెజ్లింగ్ సమాఖ్య మొదట ఆమెకు అవకాశం ఇవ్వకపోయినా, సుప్రీంకోర్టు ఆదేశాలతో 53 కేజీల కేటగిరీలో ఆడేందుకు అనుమతి లభించింది. వినేశ్ తదుపరి బౌట్‌లో నిషూతో తలపడనుంది.

సంబంధిత పోస్ట్