మణిపూర్‌లో కొనసాగుతున్న హింసపై యువ పర్యావరణవేత్త లిసిప్రియ కంగుజం ప్రధాని మోదీపై మండిపడ్డారు. కుకీ మిలిటెంట్లు రాకెట్ దాడి చేయడంతో ఇద్దరు పిల్లలు మరణించారని, ఆర్మీ క్యాంప్‌కు కిలోమీటరు దూరంలోనే ఇది జరగడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మోదీజీ.. మణిపుర్ భారత్‌లో భాగం కాదా? మీరు ఇప్పటికైనా మౌనం వీడాలి' అని ఆమె డిమాండ్ చేశారు.