విరాట్ కోహ్లీ 2019 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాకు నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. తాజాగా ఈ విషయాన్ని యుజ్వేంద్ర చాహల్ గుర్తు చేసుకున్నాడు. ‘2019 వరల్డ్ కప్ సమయంలో విరాట్ బాత్రూమ్‌లోకి వెళ్లి ఏడ్చాడు. నేనే చివరిగా క్రీజులోకి వచ్చా. కోహ్లీని దాటి ముందుకెళ్తుంటే అప్పటికే అతడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నేను ఇంకొంచెం ఉత్తమంగా బౌలింగ్ చేసి ఉండే బాగుండేదనిపించింది’ అని తెలిపారు.