టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ 2011లో సరిగ్గా ఇదేరోజు ఆ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్లేయర్‌గా, కెప్టెన్‌గా టెస్ట్ క్రికెట్‌కు ఆయన అందించిన సేవలను ఫ్యాన్స్ మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. టెస్టుల్లో 113 మ్యాచులు ఆడిన కోహ్లీ.. 191 ఇన్నింగ్స్‌లలో 49.15 యావరేజ్‌తో 8,848 రన్స్ చేశారు. అందులో 29 సెంచరీలు, 30 అర్ధ సెంచరీలున్నాయి. కెప్టెన్‌గా 40 విజయాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.