రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్లేయర్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు (8,989) చేసిన ప్లేయర్‌గా కోహ్లీ కొనసాగుతున్నారు. సోమవారం ఢిల్లీతో మ్యాచ్‌లో కోహ్లీ 11 పరుగులు చేస్తే టోర్నీలో 9,000 పరుగులు పూర్తి చేసుకుంటారు. 9 వేల పరుగులు పూర్తి చేస్తే ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించనున్నారు.