భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వన్డేల్లో అరుదైన రికార్డులు నమోదు చేశారు. ఇంగ్లండ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచారు. 2,645 పరుగులతో రాహుల్ ద్రవిడ్ రికార్డును ఇంగ్లండ్‌తో జరుగుతున్న 2వ వన్డేలో అధిగమించారు. అలాగే వన్డేల్లో 300 ఇన్నింగ్స్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన జాబితాలోనూ విరాట్ అగ్రస్థానంలో నిలిచారు. ఈ క్రమంలో 14,800 పరుగులు దాటారు. ఈ జాబితాలో సచిన్, గంగూలీ, పాంటింగ్, కల్లిస్, ద్రవిడ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.