VISA: ఓటీపీ, పాస్‌వర్డ్‌ల స్థానంలో పాస్‌కీ

భారత డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు ఉన్నప్పటికీ, ఆర్థిక మోసాలను అరికట్టేందుకు వీసా సంస్థ 'పేమెంట్ పాస్‌కీ' విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై డివైజ్ పాస్‌వర్డ్, ఫేషియల్ రికగ్నిషన్, ఫింగర్‌ప్రింట్‌తో ఆన్‌లైన్ లావాదేవీలు సులభతరం అవుతాయి. ఏఐ యుగానికి తగ్గట్టుగా ఈ విధానాన్ని రూపొందించినట్లు వీసా గ్రూప్ మేనేజర్ సురేశ్ సేథీ తెలిపారు. సంప్రదాయ ఓటీపీ, పాస్‌వర్డ్‌ల కంటే బయోమెట్రిక్ విధానం సురక్షితమని, మొబైల్ నెట్‌వర్క్ సమస్యల వల్ల ఓటీపీలు రాక ఇబ్బందులు తప్పనున్నాయని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్