పోలీసుల అదుపులో విశాఖ ఎక్స్‌ప్రెస్‌ అత్యాచార నిందితుడు

విజయవాడ రైల్వే పోలీసులు విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన దంపతులు ఆదివారం రాత్రి విశాఖ నుంచి నడికుడికి ప్రయాణిస్తున్నారు. జనరల్ బోగీలో బాత్‌రూం వద్ద కూర్చున్న వారిని, రైలు విజయవాడ సమీపానికి చేరుకోగానే ఏసీ బోగీలో బాయ్‌గా పనిచేస్తున్న ఒడిశాకు చెందిన శౌరవ్‌ బగ్ది ఏసీ బోగీలోకి ఆహ్వానించాడు. దంపతులు ఏసీ బోగీలోకి వెళ్ళాక, భర్త ఫోన్ చూసుకుంటుండగా, నిందితుడు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్