సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99వ చిత్రంగా, విశాల్ హీరోగా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మకుటం’. అంజలి, దుషార విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, శుక్రవారం ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. విశాల్ విభిన్న గెటప్‌లలో కనిపించనుండటం, తనే దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.