దేశ రాజధాని ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) డిమాండ్ చేసింది. ఢిల్లీ విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి సురేంద్ర కుమార్ గుప్తా ఢిల్లీ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మంత్రికి ఆదివారం లేఖ రాశారు. ఈ లేఖలో ఢిల్లీతో పాటు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, షాజహాన్‌బాద్ డెవలప్‌మెంట్ బోర్డు, ఢిల్లీ రైల్వే స్టేషన్ పేర్లను కూడా మార్చాలని సూచించారు. ఇటీవల మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరు మార్పును కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.