ప్రీమియం ఆడియో అనుభవాన్ని అందించేందుకు Vivo TWS 5 Pro ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో చైనాలో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఇయర్‌బడ్స్‌లో శక్తివంతమైన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), డ్యూయల్ డ్రైవర్ ఆడియో సిస్టమ్, AI ఫీచర్లు, 50 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ వంటి ఆధునిక ఫీచర్లను అందించారు. చైనా మార్కెట్‌లో దీని ధర 999 యువాన్లు. ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.