స్మార్ట్‌ఫోన్ ప్రియులకు వివో శుభవార్త చెప్పింది. కంపెనీ తన కొత్త V సిరీస్ స్మార్ట్‌ఫోన్ వివో V80ను అక్టోబర్ 6న భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్లో 50MP ZEISS కెమెరాలు, 7,200mAh భారీ బ్యాటరీ, 1.5K 144Hz OLED డిస్ప్లే, 90W ఫ్లాష్‌ఛార్జ్ సపోర్ట్ వంటి అప్గ్రేడ్లు ఉన్నాయి. AI ఆధారిత క్రియేటివ్ టూల్స్, కొత్త OriginOS 7 కూడా దీని ప్రత్యేకతలు. ధర, వేరియంట్ల వివరాలు లాంచ్ ఈవెంట్లో వెల్లడికానున్నాయి.