ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా తన ప్రీపెయిడ్ ప్లాన్ ధరను పెంచుతూ వినియోగదారులకు షాకిచ్చింది. గతంలో 84 రోజుల వ్యాలిడిటీ గల ప్లాన్ ధర రూ.859 ఉండగా, దానిని రూ.40 పెంచి రూ.899గా నిర్ణయించింది. ఈ కొత్త ధరలు ఇప్పటికే కంపెనీ వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్లాన్లో రోజుకు 1.5 జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, 100 SMSలు లభిస్తాయి. అయితే, ఈ ధరల పెంపునకు గల కారణాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. ఈ పెంపుతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది.