ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా రూ.4600తో 365 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో దేశవ్యాప్తంగా ఉన్న 4జీ, 5జీ యూజర్లకు అపరిమిత కాల్స్, డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. 5జీ నెట్‌వర్క్ కవరేజీ ఉన్న ప్రాంతంలో 5జీ అపరిమిత డేటా అందుబాటులో ఉంటుంది. అయితే, రోజువారీ పరిమితి లేకపోయినా, 28 రోజులకు గరిష్ఠంగా 300 జీబీ డేటా వినియోగించుకోవచ్చు. పరిమితి దాటితే వేగం తగ్గుతుంది. 6 నెలల వ్యాలిడిటీతో రూ.2,475 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా లాంచ్ చేసింది.