1,00,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నాం: ఫోక్స్‌వ్యాగన్

జర్మనీకి చెందిన ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ భారీ పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కొనసాగుతున్న 50 వేల ఉద్యోగాల కోతలకు అదనంగా మరో 50 వేల పోస్టులను తగ్గించాలని కంపెనీ నిర్ణయించింది. దీంతో మొత్తం లక్ష ఉద్యోగాలపై ప్రభావం పడనుంది. చైనా కంపెనీల నుంచి పెరుగుతున్న పోటీ, అధిక ఉత్పత్తి సామర్థ్యం, అంతర్జాతీయ టారిఫ్‌ల ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. జర్మనీలోని ఎమ్డెన్, జ్వికావ్, హ్యానోవర్, నెకార్సుల్మ్ ప్లాంట్లపై భవిష్యత్ మార్పులు చేపట్టనుంది.

సంబంధిత పోస్ట్

✕
✕