కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుందని ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. 2008 మాలేగావ్ పేలుళ్ల ఘటనపై ఎన్ఐఏ కోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. పేలుళ్ల కేసులో ఏడుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా పలువురుని నిందితులుగా చేర్చి.. ఇబ్బందులకు గురిచేసిందన్నారు. కాగా.. మాలేగావ్ ఘటనలో 6 మంది మరణించిన విషయం తెలిసిందే.