ఓటర్ల జాబితా సవరణ.. 60 లక్షల ఓట్లు ఔట్?

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ గడువు ఈ నెల 10తో ముగియనుంది. అయితే ఇప్పటివరకు 77.66% ఓటర్ల వివరాలు డిజిటలైజ్ అయ్యాయని, HYD, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని సమాచారం. ఎన్యూమరేషన్ తర్వాత రాష్ట్రంలో 60 లక్షలకు పైగా ఓట్లు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 40 లక్షల మంది ఓటర్లు తమ అడ్రస్‌లో అందుబాటులో లేరని, డూప్లికేట్ ఓట్లు, ఇతర రాష్ట్రాల వారు మరో 20 లక్షల మంది ఉంటారని అంచనా.

సంబంధిత పోస్ట్