బీజేపీ, RSSలు నాలుగోసారి అధికారంలోకి వచ్చేందుకు ఓటర్ల జాబితా నుంచి ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నాయని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) ఆరోపించారు. ప్రత్యేక సవరణ ప్రక్రియ ద్వారా ఈ కుట్ర జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని గుప్పిట్లో పెట్టుకుని ఓట్లను తొలగిస్తోందని విమర్శించారు. సెప్టెంబర్ 4న శంషాబాద్లో సమావేశం నిర్వహించి, రాష్ట్రవ్యాప్త ఉద్యమంతో ‘ఓబీసీ గర్జన’ను ఢిల్లీ వరకు తీసుకెళ్తామని వీహెచ్ స్పష్టం చేశారు.