‘ఛోటాభీమ్’ పాత్ర ద్వారా ఓటు అవగాహన

చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ అలరించే యానిమేషన్ పాత్ర ‘ఛోటాభీమ్’ పశ్చిమబెంగాల్ ఓటర్లను పలకరించేందుకు సిద్ధమైంది. అక్కడ ఏప్రిల్ 23, 29న శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లలో అవగాహన పెంచేందుకు ఈసీ ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌గోల్డ్ యానిమేషన్ సంస్థ ఛోటాభీమ్ పాత్ర ద్వారా ఓటు అవగాహన ప్రచార కార్యక్రమాలు రూపొందించింది. ‘చునావ్ కా పర్వ్.. పశ్చిమ బెంగాల్ కా గర్వ్’ అనే నినాదంతో ఈ ప్రచారం సాగనుంది.

సంబంధిత పోస్ట్