వరంగల్ జిల్లా మచ్చాపురం గ్రామాంలో విషాదం చోటుచేసుకుంది. వీఆర్ఏ మొగసాని లక్ష్మణ్, మద్యానికి బానిసై శుక్రవారం గంగదేవిపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య, తండ్రి మందలించడంతో మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. తండ్రి కనకయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.