భోజనం చేసిన వెంటనే వేగంగా నడవడం లేదా వ్యాయామం చేయడం వల్ల జీర్ణక్రియ మందగించి, కడుపునొప్పి, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. నిపుణుల ప్రకారం.. భోజనం చేసిన 10-15 నిమిషాల తర్వాత 10-15 నిమిషాల పాటు సాధారణ వేగంతో నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. బొడ్డు కొవ్వు తగ్గడంతోపాటు జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారు వైద్యుల సలహా మేరకు నడవడం మంచింది.