వనపర్తి జిల్లాలో రాత్రి కలుషిత ఆహారం తిని అనారోగ్యానికి గురైన విద్యార్థులకు వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మెరుగైన వైద్యం అందించారు. వైద్యుల చికిత్సతో విద్యార్థులందరూ త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఉదయాన్నే వైద్య పరీక్షలు నిర్వహించి, అంబులెన్స్ ద్వారా విద్యార్థులను వారి వసతి గృహాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.