జూరాల ప్రాజెక్టులోకి భారీ వరద, 29 గేట్లు ఎత్తివేత

కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,29,000 క్యూసెక్కుల నీరు చేరుతోందని అధికారులు తెలిపారు. దీంతో 29 గేట్లు ఎత్తి, దిగువకు 2,26,848 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 9 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాల తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్