ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గురువారం 614 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 6.11 టీఎంసీల (గ్రాస్) నీటి నిల్వ ఉండగా.. లైవ్ స్టోరేజీ 2.404 టీఎంసీలు, ఎండీడీఎల్ పరిధిలో 3.448 టీఎంసీల నీరుంది. నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 38 క్యూసెక్కులు పోను.. మొత్తం అవుట్‌ఫ్లో 788 క్యూసెక్కులుగా నమోదైనట్లు ఆయన వెల్లడించారు.