వీపనగండ్ల మండలం బొల్లారంలోని సర్వే నంబర్ 618లో ముగ్గురు రైతులకు ఇచ్చిన అక్రమ పట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, సీపీఐ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. గ్రామకంఠంగా ఉన్న ఈ భూమిని అక్కడ నివసిస్తున్న వారికి ఇవ్వాలన్నారు. 30 ఏళ్ల క్రితం విక్రయించిన భూమిని అధికారులు సాయిబాబా, సుదర్శన్, రాముడు పేర్లపై అక్రమంగా పట్టాలు ఇచ్చినట్టు ఆరోపించారు.