వనపర్తి: ఇంటి ఓనర్ వేదింపులు.. నీలిమ ఆత్మహత్య

వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల తహశీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న నీలిమ, అప్పుల బాధతో మంగళవారం రాత్రి తన అద్దె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఇంటి యజమాని వద్ద తీసుకున్న 20 లక్షల రూపాయల అప్పులో కొంత చెల్లించినా, మిగిలిన మొత్తాన్ని చెల్లించాలంటూ ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భర్త వెంకటేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్