పెద్దమందడి మండలం బలిజపల్లి జంగామాయిపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మండల ఎంఈఓ మంజులత మాట్లాడుతూ మానవ వనరుల ఆవశ్యకతను, జనాభా పెరిగితే తగ్గితే లాభనష్టాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ, పాఠశాల ఉపాధ్యాయలు, ఆయాలు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.