రైలులో వృద్ధులు, గర్భిణీలు ఎక్కువగా లోయర్ బెర్త్‌లను కోరుకుంటారు. ఇవి దొరకాలంటే బుకింగ్ సమయంలో సిటిజన్ కోటా ఉంటుంది. ఈ కోటాను ఎంచుకుంటే లోయర్ బెర్త్ వచ్చే అవకాశం ఎక్కువ. అయితే వారితో పాటు నాన్–సీనియర్ సభ్యులు అదే టికెట్‌పై ఉంటే లోయర్ బెర్త్ కేటాయించకపోవచ్చు. అందుకే వృద్ధులు, గర్భిణీలు ప్రయాణించే సమయంలో ఇతర సభ్యులకు వేరే టికెట్ బుక్ చేస్తే లోయర్ బెర్త్ దక్కే అవకాశాలు అధికం. ఒకే టికెట్‌లో అందరూ ఉంటే అది జనరల్ కేటగిరీగా పరిగణిస్తారు.