జాతీయ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, యుద్ధాన్ని కోరుకోదని పేర్కొన్నారు. అయితే శాంతియుత వాతావరణాన్ని కోరుకున్నంత మాత్రాన భారత్ బలహీన దేశం కాదని స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన డిఫెన్స్ సమిట్ 2026లో ఆదివారం ఆయన మాట్లాడారు. భారత్‌పై ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్నంతకాలం గట్టిగా బదులిస్తామని పాకిస్తాన్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. భారత్‌పై మరోసారి ఉగ్రదాడికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.