పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కండోమ్‌ల తయారీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కండోమ్‌ల తయారీకి అవసరమైన సిలికాన్ ఆయిల్ లభించట్లేదని హిల్ లైఫ్ కేర్, మాన్‌కైండ్ ఫార్మా సంస్థలు తెలిపాయి. కండోమ్‌లు చిరిగిపోకుండా ఉండేందుకు వాడే అమ్మోనియా ధరలు 40-50 శాతం పెరిగాయని పేర్కొన్నాయి. గల్ఫ్ దేశాల నుంచి 86 శాతం అమ్మోనియా దిగుమతి అవుతుందని, హార్ముజ్ జలసంధి మూసివేతతో సరఫరాకు ఇబ్బంది ఏర్పడిందని వివరించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కండోమ్‌ల ధరలు పెరిగే అవకాశం ఉంది.