వార్‌ ఎఫెక్ట్‌.. పెరగనున్న PCBల ధరలు

ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం ఎలక్ట్రానిక్స్ సరఫరా గొలుసుపై పడుతోంది. ముఖ్యంగా సౌదీ అరేబియాలోని పాలీఫెనిలిన్ ఈథర్ (PPE) ఉత్పత్తి నిలిచిపోవడంతో పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ పాలీఫెనిలిన్ ఈథర్ అనేది పీసీబీ(Printed Circuit Board)ల తయారీలో కీలక ముడి పదార్థం. ప్రపంచంలో సుమారు 70 శాతం PPE ఉత్పత్తి సౌదీ అరేబియాలోనే జరుగుతుండటంతో సరఫరా అంతరాయం గ్లోబల్ స్థాయిలో ప్రభావం చూపుతోంది. ఫలితంగా ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఐటీ హార్డ్‌వేర్ రంగాల్లో PCB తయారీ ఖర్చులు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్