ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో.. నౌకా సరకు రవాణాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దాంతో అంతర్జాతీయంగా పప్పు ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మనదేశం ఏటా 5-6 మిలియన్ టన్నుల మేర కంది పప్పు, పెసరపప్పు వంటి పప్పు ధాన్యాలను మయన్మార్, కెనడా, ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఉద్రిక్తతల వల్ల రవాణా వ్యయాలు పెరిగినా.. ఆ భారం సామాన్యులపై పడనుంది. దాంతో రిటెయిల్ ధరలు పెరగవచ్చు.