ఉక్రెయిన్‌తో యుద్ధం.. 4.50లక్షల మంది రష్యన్లు మృతి

ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి (2022 నుంచి) సుమారు 4.50 లక్షల మంది రష్యన్లు మరణించినట్లు ఓ హ్యాకింగ్‌ గ్రూప్‌ వెల్లడించింది. రష్యాకు చెందిన ఫెడరల్‌ స్టేట్‌ స్టాటిస్టిక్స్‌ సర్వీస్‌ డేటాను బెలారస్‌కు చెందిన గ్రూప్‌ హ్యాక్‌ చేయడంతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చినట్లు పేర్కొంది. యుద్ధంలో నేరుగా పాల్గొని మరణించిన వారితో పాటు.. దాని ప్రభావంతో ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఈ సంఖ్యలో ఉన్నట్లు తెలిపింది. అయితే, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా ప్రభుత్వం అధికారికంగా మరణాల సంఖ్యను వెల్లడించలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕