30 ఏళ్ల స్నేహానికి మానవత్వ ముద్ర

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడ గ్రామానికి చెందిన గుజ్జ కమలాకర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో, ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఈ విషయం తెలుసుకున్న 1996-97లో పదో తరగతిలో కలిసి చదువుకున్న మిత్రులు వెంటనే స్పందించి, రూ.55,500 ఆర్థిక సహాయాన్ని కమలాకర్ కుటుంబానికి అందజేశారు. కష్టకాలంలో అండగా నిలిచిన ఈ మిత్రుల చర్యను గ్రామస్థులు ప్రశంసిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, వేణుగోపాల్ రెడ్డి, రజిని, ప్రభాకర్, సత్యనారాయణ, రమేష్, మొయినుద్దీన్, వెంకన్న, భోజ్య, సతీష్, సుధాకర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్