జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ఎస్సీ బాలుర వసతి గృహంలో 9వ తరగతి చదువుతున్న సంతోష్ అనే 14 సంవత్సరాల విద్యార్థి చలి వాగులో పడి మృతి చెందాడు. హాస్టల్లో చదువుకునే విద్యార్థి వాగులో పడి చనిపోవడంతో బాలుడి తల్లిదండ్రులు మృతదేహంతో హాస్టల్ ముందు ధర్నా చేశారు. శుక్రవారం ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.