కూలిన 100 సంవత్సరాల వేపచెట్టు

చిట్యాల మండల కేంద్రంలో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షంతో పాటు బలమైన గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. మండలంలోని పాఠశాల ఆవరణలో భారీ చెట్లు కూలిపోగా, చిట్యాల ప్రాథమిక పాఠశాల ప్రైమరీ స్కూల్లో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన భారీ వేపచెట్టు కూలిపోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంకట్రావుపల్లి, చింతలపల్లి, పోచమ్మ గుడి ప్రాంతాల్లో పలుచోట్ల చెట్లు విరిగి రోడ్డుపై పడ్డాయి. ఈ సంఘటనలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించాయి.

సంబంధిత పోస్ట్