తెలంగాణ ఉద్యమకారులను ముందస్తుగా అరెస్టు చేయడం సరికాదని, చిట్యాల మండలం ఉద్యమకారుడు జన్నె యుగేందర్ అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి చేపట్టామని, ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను, మేనిఫెస్టోలో పేర్కొన్న వాగ్దానాలను నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని తెలిపారు.