భూపాలపల్లి జిల్లా జంగేడు ప్రాంతంలో బస్తీ బాట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు జ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వార్డు పరిధిలో పర్యటించి, స్థానిక ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులకు సంబంధించిన ప్రజల సమస్యలను విని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.