భూపాలపల్లి: కాళేశ్వరంలో గోదావరి మాతకు కొనసాగుతున్న హారతి

భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయం సన్నిధి త్రివేణి సంగమం గోదావరి మాతకు నిత్య హారతి కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. సరస్వతి నది పుష్కరాల సందర్భంగా మొదలైన గోదావరి హారతి 365 రోజుల పాటు నిత్య హారతిగా కొనసాగుతుంది. ప్రతి రోజు సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. కాళేశ్వరం ఆలయానికి వచ్చిన భక్తులు గోదావరి హారతిని వీక్షించాలని శుక్రవారం ఆలయ ప్రధాన అర్చకుడు పనకంటి ఫనింద్ర శర్మ తెలిపారు.

సంబంధిత పోస్ట్