జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం లెంకలగడ్డ గ్రామంలో మెయిన్ రోడ్ పై ద్విచక్ర వాహనం, బొలెరో వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు అటవీ శాఖ బీట్ అధికారులు చంద్రశేఖర్, శ్రీకాంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.