భూపాలపల్లి: మెగా జాబ్ మేళాను వినియోగించుకోవాలి

భూపాలపల్లిలో ఈ నెల 9న నిర్వహించే మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై త్రిలోక్ నాథ్ రెడ్డి సూచించారు. మేళాలో 10, 000కు పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. SSC, ITI, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. మండల యువత పెద్ద సంఖ్యలో హాజరై ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕