సీఎం సహాయనిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ రావు గారు అన్నారు. శనివారం భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ, చిట్యాల, భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల్లో రేగొండ, కొత్తపల్లిగోరి, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్ళపల్లి, గణపురం, భూపాలపల్లి మండలాల్లోని వివిధ గ్రామాలతో పాటు మొత్తం 191 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు రూ. 61, 10, 500/- విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.