భూపాలపల్లి మున్సిపాలిటీ రైతు పశువుల కొట్టాన్ని కూల్చింది. ఎమ్మెల్యే కక్షతో వేధిస్తున్నారని బాధితురాలు లలిత ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమి ప్రభుత్వ స్థలం కాదని, 30 ఏళ్ల కిందట కొనుగోలు చేసినదని తెలిపారు. అధికారుల చర్యలను నిరసిస్తూ క్యాంప్ ఆఫీస్‌లోనే ఉండనున్నట్టు ప్రకటించారు. మూగజీవాలను రోడ్డుపైనే వదిలేయడంతో రైతు గురువారం రోదించాడు. కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.