తెలంగాణలో ఆషాఢ మాసం బోనాల పండుగకు అత్యంత విశిష్టత ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం శాయంపేట మండలం గట్లకానిపర్తిలో మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవతలను పూజించేందుకు బోనం ఎత్తే సంప్రదాయం రాష్ట్ర వ్యాప్తంగా ఉందని అన్నారు.