భూపాలపల్లిలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ "ఫీజు పోరుబాట" పోస్టర్‌ను భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ జిల్లా నాయకులు కొల్లోజు దిలీప్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.