చల్లగరిగలో కార్డెన్ సెర్చ్

చిట్యాల మండలం చల్లగరిగలో ఎస్సై పి. సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సోదాల్లో పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు. అక్రమంగా గుడుంబా విక్రయిస్తున్న సదయ్య, బిక్షపతి, గుట్కా నిల్వ చేసిన హీరాసింగ్‌లపై కేసులు నమోదు చేశారు. 10 లీటర్ల గుడుంబా, 300 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. ప్రజలు మత్తుకు దూరంగా ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, సైబర్ నేరాల నియంత్రణకు 1930 టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలని ఎస్సై సూచించారు. ఈ తనిఖీల్లో ఎస్సైలు రాజన్, ఈశ్వరయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్